కొత్త క్రాప్​ లోన్లు వెంటనే ఇవ్వాలి : తేజస్ నందలాల్

కొత్త క్రాప్​ లోన్లు వెంటనే ఇవ్వాలి : తేజస్ నందలాల్

వనపర్తి, వెలుగు : రుణ మాఫీ చేయడం ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతుకు వెంటనే క్రాప్​ లోన్లు ఇవ్వాలని కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్  బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్బీఐ అగ్రికల్చర్  డెవలప్​మెంట్  బ్యాంక్  బ్రాంచ్ ను ఆయన సందర్శించారు. బ్యాంకు మేనేజర్, ఫీల్డ్  ఆఫీసర్లతో కలిసి పంట రుణాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.

రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వడంలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లోన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. వివిధ కారణాలతో పంట రుణాలు మాఫీ కాని ఖాతాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ అమూల్  పవార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

రుణమాఫీ కంప్లీట్​ చేయాలి

నారాయణపేట : నెలాఖరులోగా రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి  చేయాలని కలెక్టర్​ కోయ శ్రీహర్ష ఆదేశించారు. వ్యవసాయ శాఖ అదికారులతో గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 45,112 మంది రైతులకు గాను, రూ.131 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.

డబ్బులు జమకాని రైతుల వివరాలు తెలుసుకొని ఖాతాల్లో జమ చేయించాలని సూచించారు. రైతు బీమాపై నిర్లక్షం చేయవద్దని, 9 రోజుల్లో రైతు బీమా అందేలా చూడాలన్నారు. డీఏవో జాన్ సుధాకర్, హార్టికల్చర్​ ఆఫీసర్​ సాయిబాబా పాల్గొన్నారు.