పీఎంశ్రీ ఫండ్స్ వాపస్ వెళ్లొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

పీఎంశ్రీ ఫండ్స్ వాపస్ వెళ్లొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు:  జిల్లాలో 40 బడులకు మంజూరైన పీఎంశ్రీ ఫండ్స్​ను సద్వినియోగం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిధులు వాపస్​వెళ్లకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.  బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆమె మాట్లాడారు. అదనపు క్లాస్ రూమ్స్ నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లే గ్రౌండ్ తదితర సదుపాయాల కోసం నిధులు వినియోగించాలన్నారు.  

పనుల పురోగతి, నిధుల వినియోగాన్ని  చెక్ చేయడానికి ఈ నెల 27, 28న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దేవేందర్ కుమార్ నేతృత్వంలోని టీం జిల్లాకు వస్తుందని, అప్​డేట్​సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. డీఈవో అశోక్​, హెచ్​ఎంలు పాల్గొన్నారు.   

కందకుర్తి ఘాట్​అపరిశుభ్రతపై కలెక్టర్​సీరియస్​..

రెంజల్ (నవీపేట్ ) : రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. ఘాట్ అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులపై సీరియస్​అయ్యారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు కందకుర్తిని ఎంపిక చేశామని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

 హైమాస్ట్​లైట్లు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వసతి, షామియానాలు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, సీఐ విజయ్ బాబు, ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు.