
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని నిత్యం అప్రమత్తం చేస్తూ బిజీగా ఉండే ఓ జిల్లా కలెక్టర్ కాసేపు టీచర్ గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. మార్చి 14న ''మన ఊరు మన బడి'' కార్యక్రమ పనుల పురోగతిని పరిశీలించడానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష.. కోడిమ్యాల మండలం కేంద్రంలోని హై స్కూల్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో కలెక్టర్ బయాలాజీ టీచర్ గా అవతారం ఎత్తారు. బయాలజీ పాఠాలు బోధించి విద్యార్థుల సందేహాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సబ్జెక్ట్ కు సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అడిగారు కలెక్టర్. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు కలెక్టర్.