స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్​ ప్రైమరీ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఉప కేంద్రం పరిధిలోని ప్రభుత్వ, ఆశ్రమ స్కూళ్లు, గ్రామాలను సందర్శించి జ్వర పీడితులను గుర్తించి వారికి వైద్యం అందించాలన్నారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ప్రతి మంగళ, శుక్రవారాల్లో గ్రామాల్లో డ్రైడే నిర్వహించాలని సూచించారు.

 గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలోని బూర్గుడ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్​ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహార నాణ్యత, మెనూ, క్లాస్​రూమ్​లను పరిశీలించారు. టీచర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.