ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం : వినయ్ కృష్ణారెడ్డి

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం :  వినయ్ కృష్ణారెడ్డి
  •  కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నవీపేట్, వెలుగు  : ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని, రవాణా చార్జీలు చెల్లించుకుంటే సరిపోతుందని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిరన్​పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. సిరన్​పల్లి ఫైలట్​ ప్రాజెక్టు కింద 93 మందికి ఇండ్లు మంజూరు కాగా, 69 ఇండ్లు గ్రౌండింగ్​ పూర్తయ్యాయని, 12 ఇండ్లు స్లాబ్​ లెవల్​కు పూర్తయ్యాయన్నారు. 

మిగతా 24 ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్ వెంకటరమణ ను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, హోసింగ్ పీడీ పవన్ కుమార్, ఎంపీడీవో నాగనాథ్ ఉన్నారు.