ధరణి పెండింగ్​ దరఖాస్తులు పూర్తి చేయాలి : గౌతమ్

ధరణి పెండింగ్​ దరఖాస్తులు పూర్తి చేయాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో అధికారులతో ధరణి నూతన మార్గదర్శకాలపై సమీక్ష నిర్వహించారు. నూతన మార్గదర్శకాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా స్థాయిలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారుల ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్,  ట్రైనీ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా ట్రెజరీ అధికారి సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

బదిలీపై వెళ్లిన అధికారులకు సన్మానం.. 

జిల్లాలో ఉత్తమ సేవలందించి, బదిలీపై వెళ్లిన జడ్పీ సీఈవో అప్పారావు, బీఆర్డీవో విద్యాచందన, డీసీఓ విజయకుమారి, డీడబ్ల్యూఓ సుమను కలెక్టర్​ ఘనంగా సన్మానించారు. కలెక్టర్​ మాట్లాడుతూ అధికారులు తమ శాఖల విధులే కాకుండా, జిల్లాలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, పథకాల అమలులో కీలక పాత్ర పోషించారని తెలిపారు.