
- ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్లు
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. సోమవారం ఆయన మెదక్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 61 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు నమ్మకం కలిగించాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్నగేశ్, డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొల్చారం తహసీల్దార్ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసాచారి ఉన్నారు.
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణితో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 46 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వికలాంగుల పెన్షన్పెంచాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్చార్జి ఆనంద్, మడపతి రవికుమార్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఉపాధి పథకాలపై కలెక్టర్ సమీక్ష
ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాల్లో చేపట్టిన ఉపాధి పనులు విజయవంతంగా నడిచేలా అధికారులు సహకరించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ఉపాధి పథకాలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్మాట్లాడుతూ..మహిళ సంఘాల సభ్యులు లాభాలు వచ్చే వ్యాపారాలు నిర్వహించి అభివృద్ధి చెందాలన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. త్వరలో వడ్డీ రాయితీ చెక్కులు, బ్యాంకు రుణాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆమె వెంట డీఆర్డీవో జ్యోతి ఉన్నారు.
సిద్దిపేట టౌన్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అంతకుముందు జిల్లా అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో పర్యటించి శానిటేషన్, ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి, వనమహోత్సవం కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించాలన్నారు.
ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడూ పరిశీలించి శనివారంలోగా ఆన్లైన్లో నమోదుచేయాలన్నారు. ఈ రోజు జరిగిన ప్రజావాణికి 152 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో అబ్ధుల్ రహమాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేర్యాలలోని మొండిచింతకాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు.
అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్హుస్నాబాద్లోని కేజీబీవీని సందర్శించారు. స్టూడెంట్స్కు నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు. స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ చెక్చేశారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఉన్నారు