హైదరాబాద్: నమాజ్‌కు అనుమతించని కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల నిరసన

హైదరాబాద్: నమాజ్‌కు అనుమతించని కళాశాల యాజమాన్యం.. విద్యార్థుల నిరసన

కళాశాల ఆవరణలో నమాజ్ చేయడానికి యాజమాన్యం నిరాకరించడంతో సంతోష్‌నగర్‌ పరిధిలోని ఓ మహిళా డిగ్రీ కళాశాల ముస్లిం విద్యార్థులు శనివారం(ఫిబ్రవరి 24) యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 'మాకు నమాజ్‌కు అనుమతి కావాలి', 'వి వాంట్ జస్టిస్..' అంటూ వారు నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్థానిక నివేదికల ప్రకారం.. తమ ఐడి కార్డులను చించి, కళాశాల నుండి సస్పెండ్ చేస్తామని యాజమాన్యం బెదిరించినట్లు కొంతమంది ముస్లిం విద్యార్థులు ఆరోపించారు. ఈ కళాశాలలో దాదాపు 1200 మంది విద్యార్థులు చదువుతుండగా, వీరిలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ సంఘటన కళాశాల యాజమాన్యం, విద్యార్థుల మధ్య జరిగిన అంతర్గత వ్యవహారమని పోలీసులు చెప్తున్నారు.