హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మరో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే వెబ్ ఆప్షన్ల నమోదు మొదలవగా, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చింది. మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చారు.
