రూ.76 వేల ల్యాప్ ట్యాప్ ఆర్డర్ చేస్తే.. రోడ్డు పక్కన స్పీకర్స్ వచ్చాయి

రూ.76 వేల ల్యాప్ ట్యాప్ ఆర్డర్ చేస్తే.. రోడ్డు పక్కన స్పీకర్స్ వచ్చాయి

గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్ లైన్ షాపింగ్ లు నేడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఆండ్రాయిడ్ ఫోన్ ల వాడకం ఎక్కువ కావడంతో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ కి ఇష్టపడుతున్నారు. వినియోగదారులు కోరుకున్న వస్తువులు ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఇంటి ముంగిటికే వస్తుండటంతో దీనికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే కొంత మంది అమాయకులు ఆన్ లైన్ షాపింగ్ చేసి భారీగా నష్ట పోతున్న ఉదంతాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఓ కాలేజీ విద్యార్థి  76 వేల రూపాయిల విలువైన ల్యాప్ ట్యాప్ ను ఫ్లిప్ కార్డ్ ఆన్ లైన్ షాపింగ్ లో  ఆర్డర్ చేస్తే అత‌నికి 3 వేల రూపాయిల విలువైన స్పీకర్స్ డెలివరీ అయ్యాయి.  దీంతో కాలేజీ విద్యార్థి  ఫ్లిప్ కార్డ్ యాజమాన్యాన్ని తప్పుపట్టాడు. అతను డబ్బులు రిటన్ ఇవ్వడంగాని లేదా తాను ఆర్డరిచ్చిన ల్యాప్ ట్యాప్ ఇమ్మని విద్యార్థి కోరాడు.  అయినా ఆ సంస్థ సరిగా స్పందించకపోవడంతో అథర్వ  అనే విద్యార్థి  ఓ ట్విట్టర్ లో తన నిరాశను వ్యక్త పరిచాడు.  తనకు ఫ్లిప్ కార్డ్ లో జరిగిన అనుభవాన్ని వివరిస్తూ 76 వేల రూపాయిల విలువైన Macbook M1 ( ల్యాప్ ట్యాప్)ని ఆర్డర్ చేస్తే  తక్కువ ధర గల నాణ్యత లేని స్పీకర్లు వచ్చాయని ట్వీట్ చేశాడు.  ఈ విషయంలో తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నా .. నో రిటన్ అని ఫ్లిఫ్ కార్డ్ సంస్థ చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఆగస్టు 13న అతనికి ల్యాప్ ట్యాప్ డెలివరీ కావాల్సి ఉండగా.. రాకపోయే సరికి డిశ్పాచ్ విభాగాన్ని సంప్రదించగా.. ఆగస్టు 15 వ తేదీ డెలివరీ అవుతుందని చెప్పారని తెలిపాడు.  అయినా తాను ఆర్డరిచ్చిన ఐటం రాలేదని .. ఇది చాలా అన్యాయమని అథర్వ సోషల్ మీడియాలో విమర్శించాడు.  తనకు సహాయం చేయాల్సిందిగా న్యాయవాదుల ఫోరమ్ లను ట్యాగ్ చేశాడు.  దీంతో ఆన్ లైన్ వినియోగదారులు  అథర్వకు మద్దతు తెలిపారు.  ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించాలని ఫ్లిప్ కార్డ్ ను ఆన్ లైన్ వినియోగదారులు కోరారు.  తనకు న్యాయం చేయాల్సిందిగా అథర్వ రెడ్డిట్ ను ఆశ్రయించాడు.    

ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్‌లైన్‌లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.ఏది ఏమైనా ఆన్ లైన్ షాపింగ్ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.  కొన్ని పరిష్కారం కాగా.. మరికొన్ని అలానే ఉన్నాయి.  ఇలాంటి మోసాలు జరగకుండా ఈ కామర్స్ వెబ్ సైట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది.లేకపోతే ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు చేసే మోసాలకు మరికొంత మంది బలయ్యే అవకాశం ఉంది.