దమ్ముంటే పట్టుకెళ్లు ..ట్రంప్నకు కొలంబియా ప్రెసిడెంట్ పెట్రో సవాల్

దమ్ముంటే పట్టుకెళ్లు  ..ట్రంప్నకు కొలంబియా ప్రెసిడెంట్ పెట్రో సవాల్
  • మదురో కూడా ఇలాగే ఛాలెంజ్​​
  • దేశం కోసం మళ్లీ ఆయుధం పట్టుకుంట: పెట్రో
  • గుస్తావో  ఓ ‘సిక్ మ్యాన్’: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. ‘‘నన్ను పట్టుకోవడానికి ఇక్కడికే రా.. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. నన్ను బెదిరించాలని చూడొద్దు’’ అంటూ ట్రంప్‌‌ను ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరారు.

 కొలంబియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, నెక్స్ట్ టార్గెట్ కొలంబియా అని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ‘‘నన్ను పట్టుకోవడానికి ఇక్కడికే రా.. నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. నన్ను బెదిరించొద్దు’’ అంటూ ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరారు. 

గతంలో వెనెజువెలా అధ్యక్షుడు మదురో కూడా ఇదే తరహాలో ‘నన్ను పట్టుకో’ అని ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి అన్న వీడియోను వైట్ హౌస్ షేర్ చేసింది. ఈ నేపథ్యంలో పెట్రో కూడా అదే శైలిలో స్పందించారు. మదురో, పెట్రో వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘నేను గెరిల్లా నాయకుడిని. దేశ సార్వభౌమాధికారం కోసం నేను మళ్లీ ఆయుధం పట్టడానికి సిద్ధం.  గతంలో నేను ఆయుధాన్ని తాకనని ప్రమాణం చేశాను.. కానీ, నా మాతృభూమి కోసం నేను మళ్లీ ఆయుధం పట్టుకుంటాను. ఒకవేళ అమెరికా మాపై దాడి చేస్తే.. ‘ప్రజలనే జాగ్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను నిద్రలేపినట్లు అవుతుంది’’ అని పెట్రో హెచ్చరించారు. అమెరికా తమపై బాంబులు వేస్తే.. ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు గెరిల్లాలా మారతాడని వార్నింగ్  ఇచ్చారు.


పెట్రో.. నీ ఆటలు ఇక సాగవ్: ట్రంప్


గుస్తావో పెట్రో హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. కొలంబియా ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ ఉత్పత్తి దేశమని, పెట్రో ఓ ‘సిక్ మ్యాన్’ అని విమర్శించారు. ‘‘కొలంబియా కొకైన్ మిల్స్, ఫ్యాక్టరీలతో నడుస్తున్నది. ఇది అడ్డదారిలో 
అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నది. 

ఇక్కడ ఉన్నది నేను.. ఎక్కువ రోజులు పెట్రో ఆటలు సాగనివ్వను’’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనెజువెలా మాదిరి కొలంబియాపైనా దాడి చేస్తారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్​గా ఉన్నాయని చెప్పారు. 

కాగా, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలతో పెట్రో, అతని కుటుంబ సభ్యులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు విధించింది. వలసలు, డ్రగ్స్ నియంత్రణ, పర్యావరణ పాలసీల విషయంలో పెట్రో, ట్రంప్ మధ్య విభేదాలు ఉన్నాయి.