టాయ్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టాలి: ప్రధాని మోడీ

టాయ్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టాలి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశాన్ని ఆత్మ నిర్భర్‌‌ భారత్‌గా మార్చాలని ప్రధాని మోడీ మరోమారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మన్‌ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ కలలను సాకారం చేసుకోవాలన్నారు. టాయ్ ఇండస్ట్రీ గురించి మోడీ పలు విషయాలు మాట్లాడారు. విశ్వ వ్యాప్తంగా టాయ్ ఇండస్ట్రీ రూ.7 లక్షల కోట్లకు చేరిందని, దాంట్లో ఇండియా వాటా చాలా స్వల్పమన్నారు. దీన్ని పెంచుకోవడంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో చిన్న పిల్లల పరిస్థితిపై చర్చించాలని, టాయ్స్ ప్రొడక్షన్‌ పెంచాల్సిందిగా ఇండస్ట్రీ వర్గాలకు సూచించామన్నారు.

టాయ్స్ కోసం పలు స్టార్టప్‌లు జత కట్టాలని మోడీ చెప్పారు. లోకల్ ఫర్ వోకల్‌కు ఇదే సరైన సమయమన్నారు. రండి, ఆడుకోండి అంటూ మోడీ పిలుపునిచ్చారు. కొత్త విద్యా విధానం కూడా పిల్లలను బొమ్మలతో ఆడుకునేందుకు ప్రోత్సహిస్తోందని, తద్వారా వారిలో క్రియేటివిటీని బయటకు తీసుకురావాలన్నదే తమ ధ్యేయమన్నారు. యంగ్ ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌ కంప్యూటర్ గేమ్స్‌ను రూపొందించాలని కోరారు.