Bakasura: హీరోగా మారిన మరో కమెడియన్.. బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్ రిలీజ్

Bakasura: హీరోగా మారిన మరో కమెడియన్.. బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్ రిలీజ్

కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. వైవా హర్ష టైటిల్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తున్నాడు. కృష్ణభగవాన్‌‌‌‌ ,షైనింగ్‌‌‌‌ ఫణి, కేజీఎఫ్‌‌‌‌ గరుడరామ్‌‌‌‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

ఎస్‌‌‌‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని లక్ష్మయ్య  ఆచారి, జనార్థన్‌‌‌‌ ఆచారి నిర్మిస్తున్నారు.  హంగర్‌‌‌‌ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ ర్యాప్ సాంగ్‌‌‌‌ను  దర్శకుడు అనిల్‌‌‌‌ రావిపూడి విడుదల చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

వికాస్ బడిస ఈ సాంగ్ కంపోజ్ చేయడంతోపాటు రోల్ రైడాతో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. రోల్ రైడా క్యాచీ లిరిక్స్ అందించాడు. ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తూనే, ఆడియెన్స్‌‌‌‌ను థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని  దర్శక నిర్మాతలు చెప్పారు.