వచ్చే నెల రానున్న ఐకూ నియో 9 ప్రో

వచ్చే నెల రానున్న ఐకూ నియో 9 ప్రో

న్యూఢిల్లీ :  స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ నియో 7 ప్రోకు కొనసాగింపుగా నియో 9 ప్రోను వచ్చే నెల లాంచ్​ చేయనుంది. సాటిలేని పనితీరు, అద్భుత డిజైన్, ఫ్లాగ్​షిప్​ స్థాయి కెమెరా దీని ప్రత్యేకతలని ఐకూ తెలిపింది. 

ఇందులో  క్వాల్కామ్ స్నాప్​డ్రాగన్​ 8 జెన్ 2 చిప్​సెట్​ ఉండటం వల్ల చాలా వేగంగా పనిచేస్తుంది. అంతరాయం లేని పనితీరు  గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.  ఐకూ నియో 9 ప్రో 8 +256 జీబీ,  12 +256 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ దీని ధరలను ఇంకా ప్రకటించలేదు.