
- నేపాల్, బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు కూడా అలాగే ఉంది: శ్యామ్ పిట్రోడా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన కామెంట్లు రాజకీయ వివాదాన్ని రేపాయి. తను పాక్‌కు వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించిందని.. నేపాల్, బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు కూడా తను అలాగే ఫీలయ్యాయని చెప్పారు. పొరుగు దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని, సాంస్కృతిక సారూప్యాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇటీవల ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన వివాదాస్పద కామెంట్లు చేశారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిట్రోడా మాటలు సైన్యాన్ని అవమానించడమేనని, పాక్‌పై కాంగ్రెస్ పార్టీ సానుభూతి చూపుతోందని విమర్శించింది. అంతేకాకుండా, 26/11 దాడుల తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
విదేశాల్లో ఉన్నట్టు అనిపించలే
మన విదేశాంగ విధానం మొదట పొరుగు దేశాలపై దృష్టి సారించాలని పిట్రోడా సూచించారు. ‘‘నేను పాక్ వెళ్లినప్పుడు ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది. బంగ్లా, నేపాల్‌కు వెళ్లినప్పుడూ అలాగే ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ దేశాల్లో సాంస్కృతిక సారూప్యాలు, ఒకే రకమైన డీఎన్ఏ ఉన్నందున సన్నిహత సంబంధాలు కలిగి ఉండాలని వ్యక్తిగత అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు.
పాక్‌తో చర్చలు జరపాలని, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనేది విదేశాంగ విధానంపై తన దృక్పథకంగా తెలిపారు. పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ నేత ప్రదీప్ భండారి తప్పుపట్టారు. ‘‘రాహుల్ గాంధీ అత్యంత ఇష్టపడే కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడాకు పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు ‘ఇంట్లోనే ఉన్నట్టు’ అనిపించిందట.
ఇది సైన్యాన్ని అవమానించడమేనని, కాంగ్రెస్ పాక్‌పై సానుభూతి చూపుతోందని మండిపడ్డారు. 26/11 తర్వాత కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం పాక్‌పై కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.