దుబ్బాకలో బీజేపీదే ఆధిక్యం..గెలుపు అధికారికంగా ప్రకటిస్తాం : ఈసీ

దుబ్బాకలో బీజేపీదే ఆధిక్యం..గెలుపు అధికారికంగా ప్రకటిస్తాం : ఈసీ

దుబ్బాకలో 25వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 1079  ఓట్ల ఆధిక్యంలో ఉందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్  తెలిపారు. 136, 157/A పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ చేయలేదన్న ఆయన…ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో 897 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇక లెక్కించాల్సిన ఓట్ల కన్నా మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి నిబంధనల ప్రకారం ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో లెక్కింపు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నమూనా  వీవీప్యాట్ స్లిప్పుల తనిఖీ ప్రక్రియ పూర్తయ్యాక అధికారికంగా గెలుపు ప్రకటిస్తామని వెల్లడించారు.ఉప ఎన్నిక, లెక్కింపు పక్రియ సాఫీగా జరిగిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ చెప్పారు.