Big Alert : ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లపై సైబర్ దాడులు : డబ్బులు ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి..!

Big Alert : ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లపై సైబర్ దాడులు : డబ్బులు ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి..!

Cyber Attack on FasTag: కార్ల యజమానులు ప్రయాణాల సమయంలో టోల్ చెల్లించటానికి ఖచ్చితంగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా డిజిటల్ చెల్లింపులు పూర్తి చేసేందుకు వీటిని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల వాహనదారులు ఏడాదికి 200 ట్రిప్పులు ప్రయాణించేందుకు వీలుగా రూ.3వేలకే సంవత్సరం పాస్ కూడా ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. 

చాలా కాలంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, యూపీఐ చెల్లింపులు వంటి వాటిని మాత్రమే టార్గెట్ చేసిన నేరగాళ్లు ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లపై పడ్డారు. నేరుగా వారి వాలెట్ల నుంచి డబ్బును మాయం చేసేస్తున్నారు కేటుగాళ్లు. దీనికి సంబంధించి ఇప్పటికే మోసపోయిన చాలా మంది సైబర్ సెల్ అధికారులకు కంప్లెయింట్ చేస్తున్నారు. 

►ALSO READ | దీపావళి ముందు ఆటో రంగానికి జీఎస్టీ రిలీఫ్..! మోడీ ప్రకటన తర్వాత స్టాక్స్ ర్యాలీ..

ముందుగా యూజర్లకు సైబర్ నేరగాళ్లు ఫాస్ట్‌ట్యాగ్ పేరిట ఫేక్ మెసేజ్ లు పంపుతున్నారు. అందులో యూజర్లను ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ క్లోజ్ అవుతుందని.. వెంటనే దానిని నివారించటానికి కేవైసీ అప్ డేట్ చేయాలని భయపెడుతున్నారు. పైగా ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు వారు పంపిన లింక్ క్లిక్ చేయాలని సూచిస్తున్నారు. పొరపాటున వారు పంపిన మెసేజ్ నిజమే అనుకుని లింక్ క్లిక్ చేస్తే వాలెట్ ఖాళీ అవుతోందని తేలింది. అందుకే ఇలాంటి ఫేక్ మెసేజీలు, ఏపీకే ఫైల్స్, లింక్స్ కు వినియోగదారులు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. 

మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ సైబర్ నేరగాళ్ల నుంచి సేఫ్ గా ఉంచుకోండిలా.. 
* ముందుగా ఫాస్ట్‌ట్యాగ్ పేరుతో వచ్చే ఎలాంచి లింక్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఫ్లీ గిఫ్ట్స్ మెసేజ్ లకు స్పందించొద్దు. 
* అధికారిక ఫాస్ట్‌ట్యాగ్ యాప్స్, వాలెట్స్ యాప్స్, ఎన్ హెచ్ ఏఐ వెబ్ సైట్ నుంచి మాత్రమే లాగిన్ అవ్వండి. 
* మీ అకౌంట్ ఓటీపీ, పిన్, లేదా పాస్ వర్డ్ ఎవరితోనూ షేర్ చేయెుద్దు. 
* తెలియని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయటానికి దూరంగా ఉండండి. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకింగ్ డేటాను తస్కరించే ప్రమాదం ఉంటుంది.
* ఇక తప్పనిసరిగా మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలోని బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ వివరాల హిస్టరీని పరిశీలిస్తుండండి. ఏవైనా తప్పుడు ట్రాన్సాక్షన్స్ గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించండి.