
యూఎస్ కాలిఫోర్నియాలోని టెస్లా ఫ్యాక్టరీని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పియూష్ గోయల్ సందర్శించారు. ఇండియా నుంచి తమ కాంపోనెంట్ల దిగుమతులను టెస్లా రెండింతలు పెంచుకుంటుందని పేర్కొన్నారు. ‘ కంపెనీ సీనియర్ పొజిషన్లలో ఇండియన్ ఇంజినీర్లు, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ పనిచేయడం చూస్తుంటే ఆనందంగా ఉంది. టెస్లా జర్నీలో కీలకంగా వీరు ఉన్నారు. ఎలన్ మస్క్‌ను మిస్ అయ్యా. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.