
పండుగల సీజన్‌లో పెద్ద ఉపశమనంగా, పెట్రోలియం కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. నాలుగు మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రకటించాయి. నవంబర్ 16 నుంచి అమల్లోకి రానున్న సిలిండర్‌పై రూ.57.5 వరకు ధరలు తగ్గించారు. ధరల సర్దుబాటు ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో ప్రతిబింబిస్తుంది. దీపావళికి ముందు సిలిండర్‌కు రూ. 101.5 గణనీయమైన పెంపు తర్వాత ఈ ఉపశమనం లభించింది.
అయితే కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ ధరలను ప్రస్తుత స్థాయిలోనే ఉంచాయి. నవంబర్ 16 నుంచి అమలులోకి వచ్చిన 19 కిలోల LPG సిలిండర్ ధరలు:
న్యూఢిల్లీ: రూ. 1,775.5
కోల్‌కతా: రూ. 1,885.5
ముంబై: రూ. 1,728
చెన్నై: రూ. 1,942
ఈ నెల ప్రారంభంలో, OMC లు దేశవ్యాప్తంగా అనేక చోట్ల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను గత రెండు నెలల్లో రెండవసారి పెంచాయి. వాణిజ్య LPG సిలిండర్ల ధర తగ్గింపు, వంట అవసరాల కోసం LPGపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాలపై భారాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు.