
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళవారం ( ఆగస్టు 19 ) జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్. హైదరాబాద్ లో ఎన్నో పండగలు జరుగుతాయి కానీ.. గణేష్ పండగ చాలా రోజుల పాటు జరిగే పండగ అని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేసి 15 రోజుల ముందు నుండే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు.
పర్మిషన్ ఫార్మ్ లే కాకుండా ఏర్పాట్లపై చర్యలు.. ఎన్ని విగ్రహాలు, నిమర్జనం రూట్స్, ఎలక్ట్రిక్ వైర్స్ పై నిర్ణయాలు తీసుకొంటామని అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జరిగిన ప్రమాదలతో మరింత పటిష్టగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గణేష్ హైట్ పట్ల రిస్ట్రిక్షన్ లేకపోయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ప్రతి మండపం దగ్గర పోలీస్ డిప్లాయిమెంట్ ఉంటుందని.. గణేష్ మండపం దగ్గర ఫైర్ ఆక్సిడెంట్స్ అవ్వకుండా ముందస్తు వాలంటీర్లు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Also read:-హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలా.. గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
గణేష్ మండపాల దగ్గర క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని.. సౌండ్ పొల్యూషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్, జియో ట్యాగ్ తో ఫోటో తీసి అప్ లో ఎప్పటికప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయాలని అన్నారు. గణేష్ మండపాల దగ్గర దొంగతనాలు, హారాజ్మెంట్ ఘటనలు చోటు చేసుకోకుండా స్పెషల్ పోకస్ పెట్టనున్నట్లు తెలిపారు.