
హైదరాబాద్ లోని జూబ్లలీహిల్స్ లో ఉన్న MCRHRD భవనంలో గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళవారం ( ఆగస్టు 19 ) జరిగిన ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు చేశారు మంత్రి పొన్నం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ సూచన మేరకు ప్రతి సంవత్సరం మాదిరి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనంపై మూడు దశల్లో సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునేలా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు మంత్రి పొన్నం.
గణేష్ ఉత్సవాల కోసం గత సంవత్సరం కంటే ఇంకా మంచి ఏర్పాట్లు చేస్తున్నామని... శాంతి భద్రతలు,ట్రాఫిక్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షపాతం వల్ల కొంత రోడ్లకు ఇబ్బంది ఉందని.. దానిని పండగ లోపు నార్మల్ కండిషన్ తీసుకొస్తామని అన్నారు. సమాచార,దేవాదాయ శాఖ,సాంస్కృతిక శాఖ మంచి కార్యక్రమాలు చేయాలని.. వాటర్ వర్క్ ,ఆర్ అండ్ బి,శానిటేషన్ జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి పొన్నం.
Also read:-హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ కల్లోలం: వైర్ల కటింగ్‌తో వ్యాపారులు, కస్టమర్ల ఆందోళన
గణేష్ ఉత్సవాలు ప్రభుత్వం ,మండపాల బాధ్యత మాత్రమే కాదని.. అందరం కలిసి సమన్వయం చేసుకోవాలని అన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో లక్ష వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని.. 50 వేల విగ్రహాలు హైదరాబాద్ సిటీ నుండి రానుండగా.. దాదాపు 70 వేల విగ్రహాలు ట్యాంక్ బండ్ కు వస్తాయని అన్నారు.
రవాణా వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. క్రేన్ లు అదనంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు మంత్రి పొన్నం. ఏదైనా శాఖకు ఇబ్బంది అయితే ఆ అధికారి బాధ్యత వహించాలని అన్నారు. నిరక్ష్యం వహించవద్దని.. బాధ్యతగా పని చేయాలని అన్నారు.ముగ్గురు కమిషనర్లు కింది స్థాయి అధికారులతో రివ్యూ పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి పొన్నం.
వర్షం పడినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రభుత్వం తరుపున గణేష్ నిమజ్జనం, భారీ వర్షాలు పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు..అనారోగ్యం బారిన పడకుండా సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి పొన్నం.