అభివృద్ధి పనులు వెంటనే కంప్లీట్ చేయండి : రోనాల్డ్ రాస్ 

అభివృద్ధి పనులు వెంటనే కంప్లీట్ చేయండి : రోనాల్డ్ రాస్ 

హైదరాబాద్, వెలుగు: బల్దియా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జోనల్ కమిషనర్ తో కలిసి రహమత్ నగర్ జంక్షన్ అభివృద్ధి పనులను, కార్మిక నగర్ నాలా పనులు ఎస్ పీఆర్ హిల్స్ లోని దళిత స్టడీ సెంటర్, సున్నం చెరువు, 100 ఫీట్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జంక్షన్ అభివృద్ధికి రూ.4.50 కోట్లతో చేపట్టే పనులకు ప్లాన్ కూడా ఆమోదం పొందినందున మరోసారి టౌన్ ప్లానింగ్, పోలీస్ ల సలహాలు తీసుకుని పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 

కార్మిక నగర్ లో ఎన్ఎంఎస్ఎంఈ వద్ద నాలా   పనులు చేపట్టాలని సూచించారు. సున్నం చెరువులో చెత్త డంపింగ్ వేయకుండా ఫెన్సింగ్  ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎస్ పీఆర్ హిల్స్ దళిత సెంటర్ భవన నిర్మాణం పూర్తి అయినందున ప్రారంభోత్సవం చేయాలని కార్పొరేటర్ సీఎస్ రెడ్డి కమిషనర్ ను కోరగా ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ కు సూచించారు.