జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి : రోనాల్డ్ రాస్

జంక్షన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి : రోనాల్డ్ రాస్
  • కమిషనర్ రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : సిటీలో ట్రాఫిక్ కంట్రోల్​కు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా హెడ్డాఫీసులోని ఆయన చాంబర్​లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సిటీలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్​ను కంట్రోల్ చేయడంలో భాగంగా పోలీస్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు 

గుర్తించిన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లను పిలవాలన్నారు. అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు స్థలాన్ని గుర్తించాలన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ఎస్కలేటర్లు పనిచేయకపోతే వెంటనే రిపేర్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

లయోలా కాలేజీ వద్ద కల్వర్టుల వైడెనింగ్ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, జోనల్ ఎస్ఈలు పాల్గొన్నారు.