సీఎం తండ్రి స్థానంలో ఉండి ఆలోచించాలి: ఓ సామాన్యుడు

సీఎం తండ్రి స్థానంలో ఉండి ఆలోచించాలి: ఓ సామాన్యుడు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటూ సీఎం ఆఫీసుకు ఫోన్ చేసి తన బాధను పంచుకున్నాడు కరీంనగర్ కు చెందిన రంజిత్.

కార్మికులకు కనీస విలువనివ్వకుండా వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తానని సీఎం అనడం మర్యాద కాదన్నాడు. ఆర్టీసీ సంస్థ అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం పనిచేసే వారని, అలాంటి వాళ్లు తమకు ఇలా ఇబ్బంది కలిగించకూడదన్నాడు. ఉద్యోగులపైనా కానీ, కార్మికుల పైనా గానీ, ప్రజలపైనా గానీ సీఎం కేసీఆర్ అహంకార ధోరణి తగ్గాలన్నాడు. పోరాడి తెలంగాణ సాధించుకుంది ఇలా ఇబ్బందులు పడటానికి కాదని, ఉద్యమం చేస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు పెట్టుకోవాలన్నాడు. సీఎం తండ్రి స్థానంలో ఉండి ఆలోచించాలన్నాడు. స్కూలు బస్సులను వాడుకోవడానికి పిల్లలకు మరో వారం రోజులు సెలవులు పెంచడం సరికాదన్నాడు. ఉద్యోగాలు పీకేస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని.. దీనిపై మళ్లీ ఆలోచించాలని చెప్పుకొచ్చాడు.