వీరమాచినేని రామకృష్ణ కామెంట్స్ పై దుమారం

వీరమాచినేని రామకృష్ణ కామెంట్స్ పై దుమారం
  • ఎలాంటి ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఖండించిన ఐఎంఏ
  • అర్హత లేకుండా వైద్యం గురించి చెబుతున్న మాటలు ప్రజలు నమ్మొద్దు
  • వీరమాచినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: ఐఎంఏ డిమాండ్

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వీరమాచినేని రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఎలాంటి ఆధారాల్లేకుండా ఆయన మాట్లాడుతున్నారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రెటరీ, డీజీపీలతోపాటు సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లవ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 
మోడ్రన్ మెడిసిన్ చేతబడి కంటే హేయమైనదనడం సరికాదు
‘‘మురికికుంటలో ఇంగ్లీష్ మెడిసిన్ లను వేయాలి.. మోడ్రన్ మెడిసిన్ చేతబడి కంటే హేయమైనది.. డాక్టర్లు కాళ్లు నరుకుతారు..’’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరమాచినేని రామకృష్ణ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్సినేషన్ వల్ల ఉపయోగం లేదనే పలు విషయాల పై వీరమచినేని చేసిన వ్యాఖ్యలను IMA ఖండించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వీరమచినేని డాక్టర్స్ పై వీరమచినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ తరహా వాఖ్యలు చేయడం సరైంది కాదని డాక్టర్ లవ కుమార్ రెడ్డి అన్నారు. 
వీరమాచినేనికి చెందిన వీఆర్కే డైట్ కి ఎలాంటి గుర్తింపు లేదు
వీరమాచినేనికి చెందిన వీఆర్కే డైట్ కి ఎలాంటి గుర్తింపు లేదని, వీరమచినేని కి చెందిన డైట్ శాఖలపై పిర్యాదు చేస్తామని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్ రెడ్డి తెలిపారు. వీరమాచినేని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీరమాచినేని పై ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ లతో పాటు సంబంధిత అధికారులకు పిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.  అర్హత లేకుండా చెబుతున్న.. వైద్యానికి సంబంధించిన విషయాలను ప్రజలు నమ్మవద్దు అని ఆయన కోరారు.