మూగబోయిన ముత్యాల గూడెం.. ఎమ్మెల్యే భయంతో ఊరంతా ఖాళీ చేస్తున్రు

మూగబోయిన ముత్యాల గూడెం.. ఎమ్మెల్యే భయంతో ఊరంతా ఖాళీ చేస్తున్రు
  • కాటామయ్య ఉత్సవాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
  • గ్రామంలో వర్గ విభేదాలు.. పరస్పరం రాళ్ల దాడి  
  • ఆరుగురిపై కేసులు.. ఊళ్లో పోలీసు పికెట్
  • భయంతో ఊరొదిలి పారిపోయిన పురుషులు


ఖమ్మం: కూసుమంచి మండలం ముత్యాల గూడెం మూగబోయింది. నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య నలిగిపోతోంది. ఇటీవల గ్రామంలో  శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి  పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో  పాటు ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రామంలో వర్గ విభేదాలు తలెత్తాయి. వ్యవహారం కాస్తా దాడుల దాకా వెళ్లింది. రాళ్లపై పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓ రాయి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి చెందిన కారుపై పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మరుసటి రోజు నుంచి గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులు తమను అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేస్తారేమోనని భయపడి గ్రామానికి చెందిన పురుషులంతా ఊరు విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఊళ్లో మహిళలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. తమ గ్రామానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాకపోయి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని, వాళ్లు వచ్చి ఊళ్లో గొడవలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

కారణం ఇది..

ముత్యాల గూడెంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థలో ఉండడంతో గౌడ కులస్తులంతా గుడిని పునర్నిర్మానం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. గ్రామంలోని కుల పెద్దలు, గ్రామ సర్పంచ్ కలిసి గుడి నిర్మాణానికి సిద్ధం కాగా వారిలో 20 కుటుంబాలకు వారు ఒక వర్గంగా ఏర్పడి తాము వేరే గుడి కట్టుకుంటామని నిర్మాణం చేపట్టారు. ఈ నెల 11వ తారీఖున సర్పంచ్ నాయకత్వంలో గౌడ కులస్తులు దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసుకొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దానికి పోటీగా మరొక వర్గం వారు అదే తేదీలో ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. రెండు విగ్రహాలు ఒకేసారి ఊరేగింపు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని గొడవకు దారి తీసింది.

 

https://www.youtube.com/watch?v=cscllc1mk_I