
నిర్మల్, వెలుగు: గ్రామస్థాయిలో వివాదాలు, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సిస్టంను అమలు చేయనున్నారు. జూన్ 14న అన్ని న్యాయస్థానాల పరిధిలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల మంగళవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వంతో గ్రామస్థాయిలో న్యాయసాధన సాధించవచ్చని అన్నారు.
దీనిపై పోలీసులు దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ప్రజలను న్యాయ పరిష్కార ప్రక్రియలో భాగస్వామ్యం చేసేందుకు, గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కమ్యూ నిటీ మీడియేషన్ ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. కమిటీ మీడియేటర్ల నియామక ప్రక్రియలో స్థానికుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనవ్వాలన్నారు. ఇందుకు పోలీస్ స్టేషన్ ల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి టీచర్లకు శిక్షణ
లక్సెట్టిపేట, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు బడి ప్రారంభానికి ముందే టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు లక్సెట్టిపేట ఎంఈవో శైలజ తెలిపారు. స్థానిక జడ్పీఎస్ఎస్ బాలికల హైస్కూల్లో టీచర్లకు మౌలిక భాషా, గణిత సామర్థ్యాల సాధనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఎంఈవో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ట్రైనింగ్ వల్ల టీచర్లు నైపుణ్యం పెంచుకొని విద్యార్థులకు నాణ్యతతో కూడిన గుణాత్మక విద్యను అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్లు వేణుగోపాల్, బి.శ్రీనివాస్, ఎన్.తిరుపతి, జె.తిరుపతి, ఎన్.శ్రీనివాస్, గిరిధర్, రవీందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.