బీజేపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు

బీజేపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు

బీజేపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేసినం - ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, వి.గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అరాచకాలపై ఈసీకి అనేకసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వృద్ధులు, చదువురాని వారి చేతులపై పువ్వు గుర్తును అచ్చు వేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కంపెనీ నుంచి డబ్బు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన అకౌంట్లను సీజ్ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.