ఏసీ సర్వీసింగ్ కోసం విపరీతంగా వసూలు చేస్తోన్న కంపెనీలు

ఏసీ సర్వీసింగ్ కోసం విపరీతంగా వసూలు చేస్తోన్న కంపెనీలు
  • సర్వీసింగ్​  కష్టమే
  • విపరీతంగా వసూలు చేస్తున్న కంపెనీలు
  • మెజారిటీ కస్టమర్ల ఫిర్యాదు
  •  లోకల్​సర్కిల్స్​ సర్వేవెల్లడి

న్యూఢిల్లీ: కంపెనీలన్నీ తమ ప్రొడక్టుల గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటాయి గానీ ప్రొడక్టు అమ్మిన తరువాత సర్వీసింగ్​ను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఏసీల విషయంలో ఈ సమస్య  ఎక్కువగా ఉంది. ఆఫ్టర్​ సేల్​ సర్వీసెస్​ బాగుండటం లేదంటూ విపరీతంగా కంప్లైంట్లు వస్తున్నాయి. లోకల్స్​సర్కిల్స్​చేసిన సర్వే ద్వారా ఆసక్తికర సంగతులు తెలిశాయి. ఎయిర్ కండీషనర్లను సర్వీసింగ్​ చేయించుకోవడం సవాలేనని సర్వేలో పాల్గొన్న మెజారిటీ కస్టమర్లు చెప్పారు. కొందరు ఎయిర్-కండిషనర్ యజమానులతో ఈ విషయం గురించి మాట్లాడగా..  సర్వీసింగ్​కు చాలా ఖర్చు అవుతున్నదని సగం మంది అన్నారు. సర్వీసింగ్ కోసం కంపెనీని సంప్రదించి పనిచేయించుకోవడం చాలా కష్టమంటూ తమ అనుభవాలను వివరించారు.

సర్వీసింగ్​కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, నెమ్మదిగా చేస్తున్నారని 17శాతం మంది అన్నారు.   ఎయిర్ కండిషనర్ యజమానులలో 53శాతం మంది కంపెనీ సర్వీసింగ్​ను కాకుండా లోకల్​ మెకానిక్​ లేదా థర్డ్​పార్టీ సర్వీసును వాడామని చెప్పారు. భరించగలిగే ధరలకు క్వాలిటీ సర్వీసింగ్​ దొరకడం లేదని చెప్పారు. ఏసీ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 13శాతం మంది మాత్రమే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా బ్రాండెడ్ సేవలను ఉపయోగించారు.  ప్రతి ఐదుగురిలో ఒకరు బ్రాండ్ అందించిన సేవను పొందారని చెప్పారు. మెజారిటీ వినియోగదారులు స్థానిక ప్రొవైడర్ల ద్వారా సేవలను పొందామని చెప్పారు.

కంపెనీలు శ్రద్ధ చూపాలె..

“ఏసీ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ అమ్మకాల తర్వాత సేవపై ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే కస్టమర్లు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై ఆధారపడాల్సి వస్తుంది. కంపెనీలు భరించేగలిగే ధరలతో త్వరగా సర్వీసింగ్​ చేయాలి. ఎయిర్ కండిషనర్ల సర్వీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాధారణ ప్రమాణాలను ప్రభుత్వాలు తయారు చేయాలి. వీటిపై ప్రచారం కూడా చేయాలి ”అని లోకల్​ సర్కిల్​ రిపోర్ట్​ పేర్కొంది. అధిక ఖర్చులు, కంపెనీ కాల్​సెంటర్​తో మాట్లాడటానికి ఇబ్బందిపడాల్సి రావడం, నెమ్మదిగా సేవలు అందించడం, నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడం వల్ల యజమానులు  ఏసీ కంపెనీల సర్వీసింగ్​ను ఉపయోగించుకోవడం లేదని ఎక్కువ రెస్పాండెంట్లు చెప్పారు.  థర్డ్​పార్టీలు కూడా సర్వీసింగ్​కు క్వాలిటీ లేని కాంపొనెంట్లు వాడుతున్నాయని, దీనివల్ల ఏసీలు పాడవుతున్నాయని వివరించారు.