వంట నూనె ధరలు  తగ్గిస్తున్న కంపెనీలు

వంట నూనె ధరలు  తగ్గిస్తున్న కంపెనీలు

లీటర్‌‌‌‌‌‌‌‌పై రూ. 4-7 వరకు కోత
న్యూఢిల్లీ: పండగ టైమ్‌‌‌‌లో జనం మీద కన్జూమర్ల భారాన్ని తగ్గించేందుకు  వంట నూనె తయారీ కంపెనీలు ముందుకొచ్చాయి. వంట నూనె రేటును లీటర్‌‌‌‌‌‌‌‌పై రూ.4–7 వరకు తగ్గించాయి. అదానీ విల్‌‌‌‌మర్‌‌‌‌‌‌‌‌, రుచి సోయా ఇండస్ట్రీస్‌‌‌‌  కంపెనీలు తమ హోల్‌‌‌‌ సేల్ రేట్లను తగ్గించాయని సాల్వెంట్ ఎక్స్‌‌‌‌ట్రాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్ (ఎస్‌‌‌‌ఈఏ) మంగళవారం పేర్కొంది. ఇతర వంటనూనె తయారీ కంపెనీలయిన జెమినీ ఎడిబుల్స్‌‌‌‌ , ఫ్యాట్స్‌‌‌‌ ఇండియా (హైదరాబాద్‌‌‌‌), మోడీ నేచురల్స్‌‌‌‌ (ఢిల్లీ), గోకుల్‌‌‌‌ రీఫోయిల్స్‌‌‌‌ అండ్ సాల్వెంట్‌‌‌‌ (సిధ్‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌), విజయ్ సాల్వెక్స్‌‌‌‌ (అల్వర్‌‌‌‌‌‌‌‌), గోకుల్‌‌‌‌ ఆగ్రో రిసోర్సెస్‌‌‌‌, ఎన్‌‌‌‌కే ప్రొటీన్స్‌‌‌‌ (అహ్మదాబాద్‌‌‌‌) వంటి కంపెనీలు కూడా త్వరలో రేట్లు తగ్గిస్తాయని ఎస్‌‌‌‌ఈఏ ప్రకటించింది.  పండగ టైమ్‌‌‌‌లో కన్జూమర్లపై ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు  వంట నూనె రేట్లను తగ్గించాలని ఎస్‌‌‌‌ఈఏ కంపెనీలను కోరింది. దీంతో పైన పేర్కొన్న కంపెనీలు టన్ను వంట నూనెపై రూ. 4000–7,000 వరకు తగ్గిస్తున్నాయని  ఈ సంస్థ ప్రెసిడెంట్‌‌‌‌ అతుల్‌‌‌‌ చతుర్వేది ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొన్నారు. దేశంలో సోయాబిన్‌‌‌‌, వేరుశెనగ దిగుబడి ఈ ఏడాది పెరుగుతుందని, ఆవాల పంట  విస్తీర్ణం కూడా పెరిగిందని చతుర్వేది అన్నారు. వీటితో పాటు గ్లోబల్‌‌‌‌గా వంట నూనె సప్లయ్‌‌‌‌  పెరుగుతోందని, దీంతో రానున్న పెళ్లిళ్ల సీజన్‌‌‌‌ టైమ్‌‌‌‌కి వంట నూనె ధరలు దిగొస్తాయని చెప్పారు. ఇండోనేషియా, బ్రెజిల్ వంటి దేశాల్లో వంటనూనెను బయో ఫ్యూయల్‌‌‌‌ కోసం వాడుతుండడంతో గ్లోబల్‌‌‌‌ సప్లయ్ చెయిన్‌‌‌‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో గత కొన్ని నెలల్లో వంట నూనె ధరలు భారీగా పెరగడాన్ని చూడొచ్చు. దేశ వంట నూనె అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతుల ద్వారా చేరుకుంటున్నాం. గ్లోబల్‌‌‌‌గా ఏమాత్రం ధరలు పెరిగినా ఆ ప్రభావం డొమెస్టిక్‌‌‌‌గా కనిపిస్తోంది. వంట నూనె ధరలను తగ్గించేందుకు ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంది.