తీసేసిన వాళ్లకే మళ్లీ కొలువులిస్తున్న కంపెనీలు

తీసేసిన వాళ్లకే మళ్లీ కొలువులిస్తున్న కంపెనీలు
  • ట్రెండింగ్‌‌‌‌గా మారిన రీహైరింగ్

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ప్రభావంతో ఉద్యోగం నుంచి తీసేసిన వారిని కంపెనీలు మళ్లీ నియమించుకుంటున్నాయి. రీహైరింగ్ ప్రస్తుతం ట్రెడింగ్‌‌‌‌గా మారింది. తమ క్లయింట్ బేస్‌‌‌‌లో 40 శాతం మంది లేఆఫ్ చేసిన వర్కర్లను మళ్లీ నియమించుకోవాలని చూస్తున్నట్టు స్టాఫింగ్ కంపెనీ టీమ్‌‌‌‌ లీజ్ బిజినెస్ హెడ్ మునిరా లోలివాలా చెప్పారు. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ రీహైరింగ్‌‌‌‌కు ఎక్కువగా చూస్తున్నట్టు ఆ తర్వాత మాన్యుఫాక్చరింగ్, హాస్పిటాలిటీ, హెల్త్‌‌‌‌కేర్ ఇండస్ట్రీలో రీహైరింగ్ ఉన్నట్టు మునిర చెప్పారు. రీహైరింగ్ కూడా కొన్ని ప్రాజెక్ట్‌‌‌‌ల కోసం లేదా ఫ్రీలాన్సింగ్ కోసం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రీహైర్ చేస్తోన్న 40 శాతం క్లయింట్స్‌‌‌‌లో కేవలం 5–10 శాతం మంది మాత్రమే పర్మినెంట్ పొజిషన్లను ఆఫర్ చేస్తున్నారు. మిగతా వారందరూ కొన్ని ప్రాజెక్ట్‌‌ల కోసం లేదా ఫ్రీలాన్సింగ్‌‌‌‌కే రీహైరింగ్ చేస్తున్నట్టు మునిర చెప్పారు. కరోనా మహమ్మారితో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగా ప్రభావితమైంది. తమ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో(200 మందిలో) సగం మందిని లీవ్‌‌‌‌పై ఇంటికి పంపినట్టు విస్తా రూమ్స్ ఫౌండర్ అమిత్ దమానీ చెప్పారు. ‘వ్యాపారాలను విస్తరించేందుకు జనవరి నుంచి ఎక్కువ మందిని నియమించుకున్నాం. కానీ కరోనా వచ్చి మొత్తం ఇబ్బందుల్లో పడేసింది. మా ప్లాన్స్‌‌‌‌ను  మార్చుకోవాల్సి వస్తుంది’ అని అమిత్ చెప్పారు. పరిస్థితులు మెరుగయ్యాక తాము లీవ్‌‌‌‌పై పంపిన ఉద్యోగులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని అమిత్ పేర్కొన్నారు.