ఈ సంవత్సరం 10 శాతం జీతాలుపెరిగే చాన్స్​

ఈ సంవత్సరం 10 శాతం జీతాలుపెరిగే చాన్స్​

న్యూఢిల్లీ: మనదేశంలోని కంపెనీలు ఈ సంవత్సరం సగటున 10 శాతం జీతాల పెంపుదలని అంచనా వేస్తున్నాయి, ఆటోమొబైల్, తయారీ  ఇంజనీరింగ్ రంగాల్లో అత్యధిక పెంపుదల ఉండవచ్చని ఓ సర్వే పేర్కొంది. ఢిల్లీలో మంగళవారం కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే (టీఆర్​ఎస్​) విడుదల చేసిన రిపోర్ట్​ ప్రకారం 2023లో సగటు జీతం పెంపు 9.5 శాతం ఉంది. 

 గత మే– ఆగస్టు  మధ్య నిర్వహించిన ఈ సర్వేలో  21 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1,474 కంపెనీల నుంచి డేటాను సేకరించారు. ఇది వివిధ పరిశ్రమలలోని జీతం పోకడలపై దృష్టి సారించింది. ఉద్యోగి పనితీరు, సంస్థ పనితీరు,  సాలరీ రేంజ్​లో పొజిషన్​...ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్ణయించే మొదటి మూడు అంశాలు. మనదేశంలో  స్వచ్ఛంద రాజీనామాల రేటు 2021లో 12.1 శాతం నుంచి 2022లో 13.5 శాతానికి  పెరిగిందని టీఆర్​ఎస్​ పేర్కొంది.