రామ్‌‌‌‌‌‌‌‌కీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా లాభం రూ. 84 కోట్లు

రామ్‌‌‌‌‌‌‌‌కీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా లాభం  రూ. 84 కోట్లు
  • క్యూ4 లో రూ.548 కోట్లకు పెరిగిన కంపెనీ రెవెన్యూ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రామ్‌‌‌‌‌‌‌‌కీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ. 548 కోట్ల రెవెన్యూ (స్టాండ్ఎలోన్‌‌‌‌‌‌‌‌)  వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.441 కోట్లతో పోలిస్తే 24 శాతం పెరిగింది. నికర లాభం 75 శాతం ఎగసి రూ.48 కోట్ల నుంచి రూ.84 కోట్లకు చేరుకుంది.  రామ్‌‌‌‌‌‌‌‌కీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాకు 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,033 కోట్ల ఆదాయం, రూ.360 కోట్ల నికర లాభం వచ్చింది. 

కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌ బేసిస్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ క్యూ4 లో రూ.581 కోట్ల రెవెన్యూ, రూ.57 కోట్ల నికర లాభం సాధించింది. 2023–24 లో రూ.2,161 కోట్ల రెవెన్యూ, రూ. 321 కోట్ల నికర లాభం పొందింది.   మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితులు బాగోలేకపోయినా,  లిక్విడిటీ సమస్యలు ఉన్నా  అప్పులను భారీగా తగ్గించుకోగలిగామని రామ్‌‌‌‌‌‌‌‌కీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా ఎండీ  వైఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగరాజ అన్నారు.  సస్టయినబుల్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇచ్చామని, కంపెనీ ఫలితాల్లో  ఇది కనిపిస్తోందని పేర్కొన్నారు.