18 ఏండ్లయినా నష్టపరిహారం చెల్లించలేదు

 18 ఏండ్లయినా నష్టపరిహారం చెల్లించలేదు
  • రంగారెడ్డి కలెక్టర్ ను కలసి వినతిపత్రం ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

రంగరెడ్డి జిల్లా: బాండ  రవిరాల, చిన్న రవిరాల  భూ నిర్వాసితులు 18 ఏండ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ జోన్  కింద భూమిని  తీసుకున్న ప్రభుత్వం 18 ఏండ్లయినా ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. అనవసర  కాలయాపన చేస్తోందని  మండిపడ్డారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు జీనవం కోసం చాలా కష్టాలు పడుతుంటే పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

భూనిర్వాసితుల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం చూపకపోతే 72 గంటల నిరాహారదీక్ష చేస్తానని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని రంగారెడ్డి  కలెక్టర్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం  అందజేశారు.