
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు ఎంపీ రేవంత్ రెడ్డి. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న రేవంత్ ..గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.
జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరిస్తూ శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ విద్యుత్ ప్రాజెక్టును చంపేసే కుట్ర చేస్తున్నాడని చాలా కాలంగా మేం చెబుతున్నామన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో దుర్ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.