కరోనా మృతుల కుటుంబాలకు 4 నెలల్లోగా పరిహారం చెల్లించాలన్న కోర్టు

కరోనా మృతుల కుటుంబాలకు 4 నెలల్లోగా  పరిహారం చెల్లించాలన్న కోర్టు

హైకోర్టు తుది ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: కరోనా మృతుల కుటుంబాలకు నాలుగు నెలల్లోగా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు పాటించాల్సిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది. వైరస్‌‌‌‌‌‌‌‌ తీవ్రత బాగా తగ్గినందున కరోనాపై దాఖలైన పిల్స్‌‌‌‌‌‌‌‌పై విచారణ అవసరం లేదని చెప్పింది. పిల్స్‌‌‌‌‌‌‌‌ పరిష్కారమైనట్లుగా చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులకు అండగా నిలుస్తూ పిల్స్‌‌‌‌‌‌‌‌ వేసి వాటి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించడం హర్షణీయమని కొనియాడింది.