జీహెచ్‌‌‌‌ఎంసీ చట్ట సవరణపై హైకోర్టులో పిటిషన్

జీహెచ్‌‌‌‌ఎంసీ చట్ట సవరణపై హైకోర్టులో పిటిషన్
  •     ప్రభుత్వానికి నోటీసులు జారీ 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (జీహెచ్‌‌‌‌ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌‌‌‌ను సవాల్‌‌‌‌ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. 

ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌‌‌‌ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌‌‌‌లను సవాల్‌‌‌‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బి.రాజు వేసిన మూడు పిటిషన్లను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ మొహియుద్దీన్‌‌‌‌ల ధర్మాసనం బుధవారం విచారించింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్‌‌‌‌ దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో.. విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేసింది.