కబ్జాకు పాల్పడ్డారని మాజీ ఎంపీపై ఫిర్యాదు

కబ్జాకు పాల్పడ్డారని మాజీ ఎంపీపై ఫిర్యాదు


పద్మారావునగర్, వెలుగు: చేవేళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్​ రెడ్డి ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డారంటూ అడ్వకేట్​ రామారావు ఇమ్మానేని స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్​ రాష్ట్ర కమిషనర్, ఇన్​స్పెక్టర్ జనరల్,  డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ జనరల్​కు ఫిర్యాదు చేశారు. పుప్పాలగూడలోని నిషేధిత భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయాలు చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎంపీతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.