కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాపరెడ్డిపై సొంత పార్టీ నేతల ఫిర్యాదు

కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాపరెడ్డిపై సొంత పార్టీ నేతల ఫిర్యాదు

 హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డిపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ప్రతాపరెడ్డి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం గాంధీభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, వీళ్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇటీవలే ప్రతాపరెడ్డి పీసీసీకి ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు ఐదుగురికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తాము తప్పు చేయలేదని, తమను కావాలనే ప్రతాపరెడ్డి వేధిస్తున్నాడని వారు గురువారం ఫిర్యాదు చేశారు. తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ప్రతాపరెడ్డి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డితో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతానని మహేశ్‌కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.