నిజామాబాద్, వెలుగు: తమను కుల బహిష్కరణ చేశారని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దూస్గామ్ గ్రామ దళితులు గురువారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల కింద ఏర్పాటు చేసిన వీడీసీలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరగా సర్పంచ్, వీడీసీ సభ్యులు దూషించారని చెప్పారు. ఇతర గ్రామాల నుంచి డప్పులు కొట్టేవారిని పిలిపించి ఉపాధిని దెబ్బతీశారని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సర్పంచ్ శివారెడ్డి స్పందిస్తూ వీడీసీ ఎన్నిక సమయంలో జరిగిన వివాదంతో తనకు సంబంధం లేదని, తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.
