
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డబుల్బెడ్రూమ్ఇండ్ల లబ్ధిదారులు భారీగా తరలివచ్చారు. గత ప్రభుత్వం ఇండ్లు అప్పగించిందే కానీ.. అందులో సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. ఇంకా కరెంట్, వాటర్ సప్లయ్ పనులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. సౌకర్యాలు లేని తమ ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నామని ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బల్దియా హెడ్డాఫీసుకే డబుల్ బెడ్రూమ్ఇండ్లకు సంబంధించి 200 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా హెడ్డాఫీసుకు 257, జోనల్ఆఫీసుల్లో నిర్వహించిన ప్రజావాణికి 77 ఫిర్యాదులు వచ్చాయి. ఈఎన్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, గీతా మాధురి, సత్యనారాయణ, యాదగిరిరావు, జయరాజ్ కెన్నడి, సీపీపీ రాజేంద్రప్రసాద్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, ఎంటమాలజీ చీఫ్ డా.రాంబాబు, హౌసింగ్ ఎస్ఈ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 132 ఫిర్యాదులు అందాయి. ఇందులో 117 గృహ నిర్మాణ శాఖకు, 15 శాఖలకు సంబంధించినవి 15 ఉన్నాయి. అడిషనల్కలెక్టర్ పి.కదిరవన్ పాల్గొని ఫిర్యాదులు తీసుకున్నారు.