నెల రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయండి

నెల రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయండి

రిజర్వాయర్లను పరిశీలించిన స్మితా సబర్వాల్

చిన్నకోడూరు, ములుగు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పదకొండవ ప్యాకేజీలో భాగమైన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్, మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్పనులను సీఎం ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు పనుల తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్సంప్ హౌస్ లో పనులు నత్తనడకన నడుస్తుండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాజెక్టు పని తీరుపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 15లోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ నెలలో నీరు వచ్చేలా అధికారులు పని చేయాలన్నారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నారు.