బాపు ఘాట్లో ఏర్పాట్లు పూర్తి చేయండి.. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

బాపు ఘాట్లో  ఏర్పాట్లు పూర్తి చేయండి..  హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

మెహదీపట్నం, వెలుగు: లంగర్​హౌస్​లోని బాపు ఘాట్​లో గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. మంగళవారం (సెప్టెంబర్ 01) బాపు ఘాట్​ను అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డితో కలిసి ఆమె సందర్శించారు. బాపూ మ్యూజియం హాల్లో ఏర్పాట్లపై సమీక్షించారు. 

అధికారులు సమన్వయంతో పని చేసి, నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాష్ట్ర గవర్నర్, సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు బాపు ఘాట్, మ్యూజియంను సందర్శించనున్నారని, ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డీవో రామకృష్ణారావు, డీఎంహెచ్‌‌వో డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ అహల్య తదితరులు పాల్గొన్నారు.