శ్రీవిష్ణు నుంచి రాబోతున్న చిత్రం కామ్రేడ్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ కామెడీ డ్రామా

శ్రీవిష్ణు నుంచి రాబోతున్న చిత్రం కామ్రేడ్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ కామెడీ డ్రామా

శ్రీవిష్ణు నుంచి రాబోతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమ నంబియార్ హీరోయిన్. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు.  కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా రిలీజ్ కానుంది. మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 1992లో ఆంధ్రా,  -ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే కథ ఇది.  ఊర్లో సినిమా థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుపుతుంటాడు కళ్యాణ్.  బాలకృష్ణకు వీరాభిమాని అయిన అతని తల్లిగా రాధిక కనిపించారు.  హ్యాపీ సాగిపోతున్న కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లోకి ఒడిశాకు చెందిన అమ్మాయిగా మహిమ నంబియార్ వస్తుంది. 

ఇంతలో అతను మోస్ట్ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ నక్సలైట్‌‌‌‌‌‌‌‌ అంటూ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షైన్ టామ్ చాకో వెతుకుతుంటాడు. జైలులో ఉన్న తమ నక్సలైట్ సహచరులను విడిపించేందుకు కళ్యాణ్, అతని గ్యాంగ్ ఓ కీలక రాజకీయ నేతను కిడ్నాప్ చేయడం ఆసక్తిని పెంచుతోంది.  ఇంతకూ అతను నక్సలైట్‌‌‌‌‌‌‌‌ ఎందుకు అయ్యాడు అనేది మిగతా కథ. నక్సలైట్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా కామెడీతో ఆకట్టుకుంది.  శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌ చేశాడు. సత్య,  బ్రహ్మాజీ, ఉపేంద్ర లిమాయే ఇతర పాత్రల్లో కనిపించారు.