హైదరాబాద్ పోలీసుల అదుపులో ఖిలాడి లేడీ.. 500 కోట్ల స్కాం చేసిందంటే మాములు విషయం కాదుగా !

హైదరాబాద్ పోలీసుల అదుపులో ఖిలాడి లేడీ.. 500 కోట్ల స్కాం చేసిందంటే మాములు విషయం కాదుగా !

హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఖిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు. లక్షనో.. రెండు లక్షలో కాదు.. ఈ కంత్రీ లేడీ ఏకంగా 500 కోట్ల స్కాం చేసింది. బడా వ్యాపారుల దగ్గర 500 సంధ్యారాణి అనే ఈ లేడీ ఖిలాడీ 5 వందల కోట్లు వసూలు చేసింది. ఆమె భర్త శ్రీధర్, తమ్ముడు ఎమర్తి రాందాస్ పరారీలో ఉన్నారు. సంధ్యారాణి ఎలా స్కాం చేసిందంటే.. 40 షెల్ కంపెనీలను స్టార్ట్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా నిధులను ఆ కంపెనీలతో పేరుతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలకు మళ్లించింది. ఆ తర్వాత కంపెనీల ఖాతాల నుంచి తన ఖాతాలోకి బదిలీ చేసుకుంది.

సంధ్యారాణి అండ్ కో కలిసి 1800 మ్యూల్ ఖాతాల్లోకి నిధులను మళ్లించారంటే ఈ ముఠా ఎంత తెలివిగా స్కాం చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఎంత తెలివిగా స్కాం చేసినా ఏదో ఒక రోజు దొరికిపోక తప్పదు. సంధ్యారాణి విషయంలోనూ ప్రస్తుతం అదే జరిగింది. బడా పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా సంధ్యారాణి స్కామ్ చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఫేక్ కంపెనీలు, ఫేక్ వర్క్ ఆర్డర్ చూపి వందల కోట్లు వసూలు ఈ సంధ్యా రాణి బ్యాచ్ చేసింది. వ్యాపారుల నుంచి వందల కోట్లు వసూలు చేసింది.