ఎమ్మెల్యే ఆఫీస్​ ఎదుట కాంగ్రెస్​ నాయకుల ఆందోళన

ఎమ్మెల్యే  ఆఫీస్​ ఎదుట కాంగ్రెస్​ నాయకుల ఆందోళన

కోల్​బెల్ట్​,వెలుగు : గృహలక్ష్మి పథకం దరఖాస్తుల గడువు పెంచాలని మందమర్రి లోని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంపు ఆఫీస్​ ఎదుట కాంగ్రెస్​ నాయకులు బుధవారం ఆందోళన చేశారు. వారిని బీఆర్​ఎస్​ కార్యకర్తలు అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో, ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. క్యాంపు ఆఫీస్​లో ఉన్న బీఆర్​ఎస్​ లీడర్లు వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించారు. బీఆర్​ఎస్​ టౌన్​ ప్రెసిడెంట్​ జె.రవిందర్ తమ పార్టీకి చెందిన మహిళ లీడర్లను అవహేళన చేస్తూ దురుసుగా ప్రవర్తించడని ఆరోపిస్తూ... మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్​ లీడర్లు డిమాండ్​ చేశారు. అనంతరం కోల్​బెల్ట్​ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. 

పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పీసీసీ మెంబర్​ నూకల రమేశ్​, టౌన్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్ గౌడ్, సోషల్​ మీడియ స్టేట్​ జనరల్ సెక్రటరీ ఎండీ. ముజాహిద్, ఎస్సీ విభాగం ప్రెసిడెంట్​ నర్వేట్ల శ్రీనివాస్, డీసీసీ మెంబర్​ పుల్లూరి లక్ష్మన్​, మహిళ విభాగం ప్రెసిడెంట్​ గడ్డం రజినీని  ఆదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​ తరలించారు. వీరిపై న్యూసెన్స్​ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్​ తెలిపారు. కాగా గొడవ విషయంపై కాంగ్రెస్​, బీఆర్ఎస్​ లీడర్లు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు.