
ఓయూ,వెలుగు: హాస్టళ్లలో మెస్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గురువారం ఓయూ క్యాంపస్‌లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై తీవ్ర నిరసన తెలిపారు. కొంత కాలంగా వర్సిటీ హాస్టళ్లలో సమస్యలు ఉన్నాయని, మెస్‌ల నిర్వహణ సరిగా లేదని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. వర్సిటీలో విద్యార్థులకు మెరుగైన మెస్ సౌకర్యాలు కల్పించడంలో ఓయూ అధికారులు ఫెయిల్ అయ్యారని ఏబీవీపీ నేత రాజు విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి మెస్‌లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.