న్యాయం జరిగే వరకు డెడ్బాడీలను తరలించం.. కుటుంబ సభ్యుల ఆందోళన

న్యాయం జరిగే వరకు డెడ్బాడీలను తరలించం.. కుటుంబ సభ్యుల ఆందోళన

మంచిర్యాల జిల్లాలో జూన్ 13న గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ముందు కార్మికులు నిరసన తెలిపారు. 

జూన్ 13న  ప్రమాదవాశాత్తు గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు డెడ్ బాడీలను తరలించబోమని కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.