కలప తరలింపులో జాగ్రత్తలు అవసరం.. డైరెక్టర్​ ఎం.జె.అక్బర్​

కలప తరలింపులో జాగ్రత్తలు అవసరం.. డైరెక్టర్​ ఎం.జె.అక్బర్​

జైపూర్​, వెలుగు:  నీలగిరి ప్లాంటేషన్ల నుంచి పేపర్​ తయారీకి అవసరమైన కలప సేకరణలో తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టాలని  రాష్ట్ర అటవీ  అభివృద్ధి సంస్థ డైరెక్టర్​, ఐఎఫ్​ఎస్​ అఫీసర్​ ఎం.జె.అక్బర్​ అన్నారు.  గురువారం  మంచిర్యాల రేంజ్​ పరిధిలోని జైపూర్​ మండలం, ముదికుంటలోని నీలగిరి ప్లాంటేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్​లో పనిచేస్తున్న కూలీలకు ప్రమాదాలు జరుగకుండా సూపర్​వైజింగ్​ చేయాలని సంబంధితా ఆఫీసర్లకు సూచించారు. 

నీలగిరి చెట్లుకోయడం, లారీల్లో కలప నింపే సమయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కూలీలకు హెల్మెట్​, బూట్లు అందజేశారు. డైరెక్టర్​ వెంట డివిజనల్​ మేనేజర్​ శ్రావణి, మంచిర్యాల రేంజ్​ ప్లాంటేషన్​ మేనేజర్లు గోగు సురేశ్ కుమార్​, ఇ.లక్ష్మణ్​, వాచర్​ శంకర్​, సిబ్బంది 
పాల్గొన్నారు.