పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా ఆఫీసర్లకు ట్రైనింగ్ నిర్వహించండి

పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా ఆఫీసర్లకు ట్రైనింగ్ నిర్వహించండి
  •      పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్లకు ఈసీ లేఖ

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు ఓటర్ జాబితా రూపకల్పనపై ట్రైనింగ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సోమవారం లేఖ రాశారు. ఈ పక్రియ ఈ నెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, రూపకల్పనపై నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఇందుకు అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ను పరిగణనలోకి తీసుకుంటామని లేఖలో సెక్రటరీ స్పష్టం చేశారు. 

త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ పనులు మొదలుపెట్టిందని ఆయన తెలిపారు.  ఓటర్ జాబితా రూపకల్పనపై ఇటీవల జిల్లా అధికారులు పంపిన ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్​కు 2 రోజుల పాటు ఈసీ ట్రైనింగ్ నిర్వహించింది.